బాపు: చిన్నప్పుడు ఆయన గీతలు ఆయన్ను మొదటిసారి పరిచయం చేసాయి. క్లుప్తంగా విషయాన్ని చెప్పడమనేదానికి ఆయన గీతలు నిలువెత్తు ఉదాహరణలు. మనం ఈనాడు గొప్పగా చెప్పుకునే minimalist design ను ఆయన ఎప్పుడో గీసి చూపించారు. సంస్కృతావిష్కృతులైన ప్రబంధనాయికలకు బాపు బొమ్మలు సరియైన తెలుగుసేతలు.
ఆయన సినిమాలు రేడియోలో వినడం చిన్ననాటి మరపురాని అనుభూతుల్లో ఒకటి. ముత్యాలముగ్గు, మంత్రిగారి వియ్యంకుడు, భక్త కన్నప్ప, పెళ్ళి పుస్తకం, వంశ వృక్షం, రాజాధిరాజు, మనవూరి పాండవులు లాంటి సినిమాలు వినోదాన్నివ్వటంతోపాటు మానవ, సామాజిక సంబంధాలను తార్కిక, మానవీయ దృక్కోణాలలో ఎలా చూడాలో చూపించాయి. ఆయన తీసిన సంపూర్ణ రామాయణం ఒక మహాకావ్యాన్ని మూడు గంటల్లోకి సంక్షిప్తం చేసిన దృశ్య కావ్యం.
బంగారానికి తావి అబ్బటమనేదానికి బాపూరమణలు ఒక మంచి ఉదాహరణ. సాక్షి వ్యాసాలనుంచి కోతికొమ్మచ్చి వరకూ వాళ్ళు అల్లిన పడుగుపేకలు తెలుగు పాఠకులకి వాళ్ళిచ్చిన పట్టువస్త్రాలు.
బాపు ఇక లేరనగానే మొదట స్ఫురించింది ఈయన రమణగారి దగ్గరకు వెళ్ళారని. విశ్వనాథవారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలలోలా ఈయన వెళ్ళి ఆయనను తీసుకొని వస్తే ఎంత బాగుణ్ణు?
Beautiful tribute for such an amazing person and the way you linked his work to minimalist design, so true. Though i never got a chance to watch his old movies, I remember hearing on radio some of the programs. Miss such for this generation, we are truly blessed to learn from such personalities.
Its is heartful to see someone is remembering bapu Garu.
We all will miss waiting for a new bapu movie,But will never miss bapu or his movies.