షాడో, మధుబాబు, స్వాతి, నవ్య

“హెచ్చరిక! ముల్తాన్ పౌరులకు పోలీసువారి హెచ్చరిక!…” చెవులు చిల్లులు పడే శబ్దంతో ఎనౌన్స్ చేస్తూ దూసుకువచ్చింది à°’à°• పోలీస్ వాన్. ఓవర్సీస్ కాల్స్‌ని ఎలౌవ్ చేసే ఫోన్‌బూత్‌లో నుంచి బయటకు రాబోతున్న షాడో ఠక్కున ఆగిపోయాడు.

డెభ్భయ్యవ దశకం నుండి తొంబయ్యవ దశకం లోపు తెలుగు డిటెక్టివ్ నవల్సు పిచ్చిగా చదివిన నాలాంటివాళ్ళకు ఈ వాక్యాలు సుపరిచితం. మధుబాబు నవలలు చదివే స్టూడెంట్లు నూటికి ఎనభైమంది ఉండేవారు. టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు మన టైముని మింగేసిన తరువాత నవలలకు, అందులోనూ డిటెక్టివ్ నవలలకు డిమాండు పూర్తిగా తగ్గిపోయింది. అమెరికా నివాస సమయంలో తెలుగు పుస్తకాలకు బాగా దూరమైపొయిన నాకు ఇండియా తిరిగి వెళ్ళిన తరువాత కొంచెం ఊపిరాడడం మొదలెట్టింది. అడపాదడపా విడుదలవుతున్న మంచి నవలలు, కథాసంపుటాలతో పాటు సీరియల్సు చదవటం మళ్ళీ మొదలయి కొనసాగుతూనే ఉంది. గత పది పన్నెండేళ్ళుగా స్వాతి వారపత్రికలో ఏదొ ఒక మధుబాబు సీరియల్ వస్తూ ఉండేది. ఈ రోజుల్లో మధుబాబు కేవలం డిటెక్టివ్ నవలలే కాకుండా జానపదాలు, సాంఘికాలు కూడా వ్రాయడం వల్ల కొంచెం వెరయిటీగా ఉంటోంది.

గత కొద్ది వారాలుగా మధుబాబు స్వాతి వారపత్రికకు మానేసి హంటర్ షాడో పేరుతో కొత్త సీరియల్ నవ్య వారపత్రికకు వ్రాయడం మొదలెట్టాడు.  అప్పట్నుండీ ప్రతీవారం స్వాతి మానేసి నవ్య చదవడం మొదలెట్టాను. కథ సంగతి ఎలాఉన్నా కథనంలో మధుబాబు రచనలు మరీ మరీ చదవాలనిపిస్తాయి. మరి కొన్నాళ్ళపాటు తన సీరియల్సు కంటిన్యూ అవుతాయని ఆశిస్తున్నాను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top