అమెరికాలో కోక్ తరువాత నేను ఎక్కువగా ఇష్టపడేది డాక్టర్ పెప్పర్. సుమారు పదిహేనేళ్ళ క్రితం మొదటిసారి డాక్టర్ పెప్పర్ తాగినపుడు మనసెటో వెళ్ళిపోయింది. వేరేరకం వెళ్ళిపోవడం అనుకునేరు సుమా, అప్పటికే నాకు పెళ్ళయిపోయింది. నాలుకమీది చిల్డ్ డాక్టర్ పెప్పర్ బిందువులు చిన్నప్పటి పల్లెటూరి ఉదయాలను గుర్తు చేసాయి. ఎడమచేతిలో పళ్ళపొడిని వేసుకొని, కుడిచేతిలోని టూత్‌బ్రష్‌ని చల్లని నూతినీళ్ళలో ముంచి, దానికి నెమ్మదిగా పళ్ళపొడి అద్ది నోట్లొ పెట్టుకున్న ఫీలింగ్ కలిగింది డాక్టర్ పెప్పర్ నోట్లోకి వెళ్ళగానే. ఇప్పటికీ డాక్టర్ పెప్పర్ తాగుతున్నపుడు చిన్నప్పుడు మిస్సయిన పళ్ళపొడి తినడాన్ని ఇప్పుడు భర్తీ చేసినట్లనిపిస్తుంది.
మేము రెండు రకాల పళ్ళపొడి వాడేవాళ్ళం – అందరికీ తెలిసిన కాల్గేట్ ఒకటయితే కొందరికి మాత్రమే తెలిసిన జెమినీ పళ్ళపొడి రెండవది. జెమినీ పళ్ళపొడి పాకెట్ మీద బూరాలు ఊదుతున్న ఇద్దరు అబ్బాయిల బొమ్మలుండేవి. అందువల్ల నాకూ, మా తమ్ముడికీ జెమినీ ఎక్కువ నచ్చేది. అంతేగాక జెమినీ పళ్ళపొడిలో మంచి లవంగం రుచి ఉండేది. ఆ కారణంగా నాకు డాక్టర్ పెప్పర్ రుచి కాల్గేట్ కన్నా జెమినీ పళ్ళపొడికి దగ్గరగా అనిపిస్తుంది. జెమినీ పళ్ళపొడిని మాటిమాటికీ గుర్తుకు తెస్తున్న డాక్టర్ పెప్పర్ కి ధన్యవాదాలు.
రాజౠగారూ, మీ అమెరికా à°ªà±à°°à°¯à°¾à°£à°‚ à°—à±à°°à°¿à°‚à°šà°¿ ఇంకా చదవాలని ఉంది. బే à°à°°à°¿à°¯à°¾ à°¸à±à°Ÿà±ˆà°²à± బిజీ వీకెండà±à°²à±‹ కాసà±à°¤ తీరిక ఉనà±à°¨à°ªà±à°ªà±à°¡à± పోసà±à°Ÿà± చెయà±à°¯à°‚à°¡à°¿.