శాలినిగారి పెళ్ళి కార్డు చూడముచ్చటగా ఉంది. నా చిన్నపట్నుంచీ చూసిన పర్సనల్ కార్డుల్లో ఇంత క్లుప్తంగా, హృద్యంగా విషయాన్ని చెప్పిన కార్డులు చాలా అరుదు. అచ్చ తెలుగులో ఇంత బాగా చెప్పిన కార్డులు లేనే లేవు.
కవరు మీద ఒకపక్క సింపుల్‌గా “నా పెళ్ళి”. అవతలిపక్క చిన్నారి సీగానపెసూనాంబ. తన బ్యాక్‌గ్రౌండులో చల్లని చంద్రుడూ, చిన్ని పిల్ల మేఘం. అడుగుపక్క చిన్ని చిన్ని డోలూసన్నాయిల తోరణం.
లోపలి కార్డు మీద ఎడమపక్క చిన్ని ఫ్లేప్ మీద సుముహూర్తం, వేదిక వగైరా వివరాలు ( బాపు ఫాంట్ లో అని చెప్పక్కర్లేదుగా ). కుడిపక్క పేజీలో నడుమ్మీద చేతులుపెట్టుకుని బుడుగు. వాడిపక్క “ఆశ్విన్‌తో” అని అసలు విషయం. వాడివంక చూపిస్తూ మురిపెంగా తలదించుకున్న సీగానపెసూనాంబ పక్కన “శాలిని”.
శాలినిగారు అసలైన విందు కార్డులోనే ఇచ్చేసారు.