మన్మధుడు సినిమాలో నాగార్జున తన చిన్నాన్న తనికెళ్ళ భరణి తో ఉక్రోషంగా “మరి ఆడాళ్ళ చీరల షాపుల్లో సేల్స్ కి మగాళ్ళు ఎందుకుంటారు?” అని అంటాడు. ఆ సన్నివేశంలో అది జోక్‌గా అనిపించినా నిజజీవితంలో అది ఒక యధార్ధం. మన తెలుగు హీరోలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. బంగారం షాపులకి, బంగారు ఆభరణాలకి ఇంకా బంగారు ఋణాలకి అడ్వర్టయిజ్ చేయడానికి మన తెలుగు హీరోలకి ఉన్న డిమాండు హీరోయిన్లకు లేకుండా పోయింది. నాగార్జున, వెంకటేష్, ఎన్టీయార్, జగపతిబాబు వంటి హీరోలు బంగారానికి సింగారాలు తీసుకొస్తున్నారు. వెరీ ఇంటరెస్టింగ్!
It’s TRUE.
Hello Raju garu, It’s TRUE.