ఈ రోజు కొంచెం బద్దకంగా నిద్ర లేచాను. ప్రొద్దున్నే ఒక గంట ఇంటిదగ్గర గడపాలనిపించింది. దానికి తగ్గట్టుగానే ప్రొద్దున్న టిఫినుకి నూకలన్నం చేసారు. నూకలన్నం తో పాటు తరిగిన బెల్లం, వెన్న పూస, ఆవకాయ కూడా రెడీ అయ్యాయి. తీరికగా కూర్చుని ఒక పెద్ద గిన్నెడు నూకలన్నం ఖాళీ చేసాను.