ఒక రైలుంది. ఆ రైలుకో ఇంజినుంది. ఆ ఇంజినుకో డ్రైవరున్నాడు. ఆ డ్రైవరుగారిది మొగల్తూరు. సైకిలు వాళ్ళూ, కారు వాళ్ళూ, ముఖ్యంగా చేతి పనులవాళ్ళూ ఆ డ్రైవరుగారిని మొగల్తూరుకి ఏమీ చేయలేదని విమర్శించారు. దాంతో ఆ డ్రైవరుగారికి కోపం వచ్చింది. మొగల్తూరుకి నేను ఏం చేయకపోవటం ఏమిటి? నేను మొగల్తూరుకి ప్రపంచంలోనే పెద్ద గుర్తింపు తీసుకువచ్చాను అన్నారు.
అది చదవగానే నాకు ఇంకొక మొగల్తూరాయన గుర్తుకొచ్చాడు. అర్ధ శతాబ్దానికి పూర్వమే మొగల్తూరుకి ఖండాంతర ఖ్యాతి తీసుకువచ్చినవాడు ఆయన. రైలు (ఈ ఎన్నికల రైలు కాదు) ఎక్కాడు. స్టీమరెక్కాడు. ఇంగ్లాండు వెళ్ళాడు. పెద్ద చదువులు చదివాడు. గోల్ఫు ఆటలో అక్కడివారినే ఖంగు తినిపించాడు. అప్పటికి కంప్యూటర్లు లేవు కాబట్టి సాఫ్టువేరు చదవ(?)లేదు కానీ ఇప్పటివాళ్ళు అతనికన్నా పెద్ద పోటుగాళ్ళేంకాదు. ఆయనగురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే మాత్రం తప్పక తెలుసుకోండి. తెలుగువారు గర్వపడదగ్గ గడుసువాడాయన. ఆయన గురించి మరిన్ని వివరాలతో ఇంకొక బ్లాగు పోస్టు వ్రాస్తాను. నమస్కారం.