ఒక ప్రభంజనంలా, ఒక అలలా మొదలైన మార్పు ఒక నీటి తుంపరలా మారింది. ఒక ప్రక్షాళన కోసం మొదలైనటువంటి ఆ అల ఈనాడు మన చర్మంపై ఉప్పు నీటి తుంపరలా వాలి, తడియారి, క్షారాన్ని మిగిల్చింది. తనుకూడా పెద్దసముద్రంలోని చిన్ని వంతునన్న నిజాన్ని నేడు నిక్కచ్చిగా చెప్పింది. ఇంకోలా మొదలైంది. అలా మిగిలింది.