ఈ రోజు సాయంత్రం ఒక తెలుగు న్యూస్ ఛానెల్ లో శోభారాజు గారి ఇంటర్వ్యూ వచ్చింది. (మీరు తికమక పడితే: శోభారాజు గారు ఒకప్పుడు తి.తి.దే. ఆస్థాన గాయకురాలు. “అదివో అల్లదివో” అన్న అన్నమాచార్య కీర్తన తో మొదలయ్యే ఆల్బం ఆవిడ గొంతులోంచి జాలువారిందే.) ఆన్నమాచార్య కీర్తనలను స్వరపరచడంపై ప్రత్యేకం గా సాగిన ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది. మనకు సుపరిచితమైన మరియు అపరిచితమైన కొన్ని కీర్తనలు, వాటి వైవిధ్య స్వరాలు చాలా బాగా పాడారు. ఆ ఇంటర్వ్యూ అయిన తరువాత “సిరుత నవ్వులవాడు సిన్నెక్క” కీర్తన మళ్ళీ వినాలనిపించింది. విన్నాను.