जगतः पितरौ वन्दे

वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये ।
जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ ॥

समयः १९८० दशकस्य आसीत्। अहं बहूनि चलच्चित्राणि पश्यामि स्म। मम प्रियतमः अभिनेता, निर्देशकः, गायकश्च मिलित्वा किञ्चित् गीतं दत्तवन्तः। सागरसङ्गमनामकस्य तेलुगु चलच्चित्रस्य तस्मिन् गीते प्रारम्भे एतानि वाक्यानि सन्ति।

श्रुत्वा पठित्वा च सर्वं अस्मभ्यं न रोचते। यद् रोचते तत् सर्वम् अस्माभिः अवगतं नास्ति। ततः यद् रोचते तत् सर्वम् अस्माभिः मूलतः ज्ञातव्यं नास्ति।

एतेषां वाक्यानां माधुर्यं रसास्वाद्य अहं चत्वारिंशत् वर्षाणि यावत् मनसि एतानि वाक्यानि गायामि स्म। कदापि न अचिन्तयं कः लेखकः आसीत्। ‘अहम् विश्वस्य पितरं पार्वती समेत परमेश्वरं नमस्करोमि‘ इत्येव अहम् अर्थम् अवगच्छामि स्म। प्रथमवाक्यं ज्ञातुं कदापि प्रयत्नं न करोमि स्म। रोचते स्म, गायामि स्म, इत्येव।

गतमासेभ्यः अहं संस्कृतं पठामि। प्रारम्भिकदिनेषु द्विवचनं ज्ञात्वा मम पर्याप्तः अभिलाषः आसीत्। यदा मया ज्ञातं अन्यासु भाषासु द्विवचनप्रयोगः नास्ति तदा संस्कृतभाषायां द्विवचनप्रयोगः भिन्नः अभवत्। ततः परम् अहं तस्मिन् अधिकं न चिन्तितवान्।

विभक्तिज्ञानकाले अहं ज्ञातवान् यत् ‘पितरौ’ इति पितृशब्दस्य द्वितीयाविभक्तेः द्विवचनम् अस्ति। तदा अहं एतेषां वाक्यानां शुद्धं अर्थं ज्ञातुं अन्वेषणम् आरब्धवान्। द्वितीयवाक्यस्य शुद्धं अर्थं ज्ञातवान् ‘जगतो जनन्यै पित्रे च, पार्वत्यै महेश्वराय च, अहं नमस्करोमि‘ इति।

प्रथमवाक्यस्य अर्थज्ञानकाले अहं ज्ञातवान् यत् एतानि वाक्यानि कालिदासस्य रघुवंशस्य प्रथमः श्लोकः अस्ति। अस्य श्लोकस्य अर्थः ‘यथा शब्दः अर्थः च संलग्नौ भवतः, तथा एव पार्वतीपरमेश्वरौ अपि संलग्नौ स्तः। अहं शब्दस्य अर्थस्य च ज्ञानार्थं जगत्-रक्षकौ पार्वती-परमेश्वरौ नमस्करोमि’ इति अस्ति।

एतद् दृष्ट्वा, अहं संस्कृतस्य द्विवचनस्य शक्तिं जानामि। अस्माकं जीवने वयं बहूनि युग्मानि पश्यामः। संस्कृतभाषायां द्विवचनस्य प्रयोगेण एतेषां युग्मानां वयं सरलं तथा अर्थपूर्णं च वर्णनं कर्तुं शक्नुमः – यथा हस्तौ, पादौ, कर्णौ, सीतारामौ, रामलक्ष्मणौ, पार्वतीपरमेश्वरौ च इति।

अत्र श्लोकात् अहं द्वितीयं महत्त्वपूर्णं ज्ञानं प्राप्तवान्। शब्दश्चार्थश्च सर्वदा संयुक्तौ स्तः। शब्दस्य शुद्धं अर्थं ज्ञातुं शब्दस्य अनुभूतिः बहु उत्तमा भवति। अहम् अस्य श्लोकस्य अपूर्णभागस्य अर्थं ज्ञातुम् अपि चत्वारिंशत् वर्षाणि यावत् श्लोकं आनन्दितवान्। सम्यक् अर्थं च सम्पूर्णार्थं ज्ञात्वा मम आनन्दः बहुधा वर्धते।

अस्य श्लोकस्य उपयोगाय चलच्चित्रजगतः जनेभ्यः धन्यवादः। अर्थपूर्णश्लोककर्तारं कालिदासं वन्दे। साहित्यवैभवाय संस्कृतं वन्दे। मां संस्कृतं पाठयतः गुरून् वन्दे।


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే |
జగత: పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ || 

1980ల నాటి కాలం. విరివిగా సినిమాలు చూసే రోజులు. నాకు నచ్చిన నటుడు, నాకు నచ్చిన దర్శకుడు కలిసి చేసిన సినిమాలోని నాకు నచ్చిన గాయకుని పాట. వెరసి సాగరసంగమం తెలుగు చిత్రంలోని ఓ పాటయొక్క మకుటంలోని ఈ పంక్తులు నాకు చాలా బాగా నచ్చాయి. 

మనం చదివిన లేదా విన్న ప్రతీదీ మనకు నచ్చాలని లేదు. నచ్చిన ప్రతీదీ అర్థమవాలనీ లేదు. అలాగే నచ్చినదానికి మూలం ఏదని తెలియాలనీ లేదు.

గత నలభై సంవత్సరాలకు పైగా ఈ పంక్తుల్ని నేను చాలాసార్లు మనసులో పాడుకున్నాను – ఆ పంక్తులలోని మాధుర్యానికి ముగ్ధుడ్నగుతూ. వ్రాసినది ఎవరన్నది ఆలోచించలేదు. అర్థం మాత్రం లీలామాత్రంగా అనుకున్నాను “ఈ జగత్తుకు తండ్రి అయిన పార్వతీసమేతుడైన పరమేశ్వరునికి నమస్కరిస్తున్నాను” అని. మొదటి పంక్తికి అర్థం అలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. నచ్చింది. మనసులో ఆహ్లాదంగా పాడుకుంటున్నాను. అంతే. 

గత కొన్ని నెలలుగా సంస్కృతం నేర్చుకుంటున్నాను. తొలిరోజుల్లో సంస్కృతంలోని ద్వివచనం గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ ద్వివచన ప్రయోగం గురించి కొంత కుతూహలం కలిగింది. నాకు తెలిసిన మిగతా భాషలలో లేని ఈ ప్రయోగం బాగానే ఉందనిపించింది. అంతకు మించి తొలిరోజుల్లో ద్వివచనం గురించి పెద్దగా ఆలోచించలేదు. 

విభక్తులు నేర్చుకుంటున్న రోజుల్లో తెలిసింది పితరౌ అనేది పితృ శబ్దానికి ద్వితీయావిభక్తిలో ద్వివచన రూపం అని. అపుడు మొదలయింది నాకు తెలిసిన పంక్తులకు సరియైన అర్థం తెలుసుకునే పని. రెండవ పంక్తికి అసలయిన అర్థం తెలుసుకున్నాను “ఈ జగత్తుకు తల్లితండ్రులయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను” అని. 

మొదటి పంక్తికి అర్థం తెలుసుకునే క్రమంలో అసలు విషయం తెలిసింది ఈ పంక్తులు నిజానికి మహాకవి కాళిదాసు వ్రాసిన రఘువంశమహాకావ్యం లోని మొదటి శ్లోకం అని. ఈ శ్లోకానికి అర్థం “శబ్దం, అర్థం కలిసిఉన్నట్టు ఎల్లప్పుడూ కలిసి ఉండే పార్వతీపరమేశ్వరులకు, ఈ జగత్తుకు తల్లితండ్రులయిన పార్వతీపరమేశ్వరులకు, శబ్దానికీ అర్థానికీ సరియైన జ్ఞానం కలిగి ఉండే నిమిత్తం నమస్కరిస్తున్నాను”. 

ఈ క్రమంలో నా మొదటి అవగాహన ఏమిటంటే సంస్కృతంలోని ద్వివచన ప్రయోగం చాలా శక్తివంతమైనది. మన జీవితంలో జంటలు చాలా కీలకం. ఇలాంటి జంటవిషయాలను సరళంగా, భావాత్మకంగా, మాధుర్యప్రధానంగా చెప్పడానికి ద్వివచన ప్రయోగం చాలా శక్తివంతమైన సాధనం. హస్తౌ, పాదౌ, కర్ణౌ, నేత్రౌ, పితరౌ, సీతారామౌ, రామలక్ష్మణౌ, పార్వతీపరమేశ్వరౌ, ఇలా.

నా రెండవ అవగాహన అత్యంత కీలకమైనది. ఈ శ్లోకం ఏమి చెపుతుందంటే శబ్దమూ అర్థమూ రెండూ కలిసే ఉంటాయి – వాటి ‘ సరియైన ‘ అవగాహన చాలా అవసరం. ఈ శ్లోకానికి అర్థం పూర్తిగా తెలుసుకోకుండా, తెలిసిన భాగం కూడా సరిగా తెలుసుకోకుండా నలభయ్యేళ్ళుగా ఈ శ్లోకాన్ని ఆస్వాదించిన నేను, దీని అర్థాన్ని పూర్తిగా, సరిగా తెలుసుకున్నతరువాత ఆ మాధుర్యాన్ని పదింతలుగా ఆస్వాదిస్తున్నాను. 

ఈ శ్లోకాన్ని నా చెవులకు చేర్చిన సినిమావారికి ధన్యవాదాలు. ఇంతటి భావయుక్తమయిన శ్లోకాన్ని వ్రాసిన కాళిదాసుకు వందనం. ఇటువంటి మాధుర్యానికి నిలయమైన సంస్కృతానికి వందనం. ఈ సంస్కృతాన్ని నేర్పుతున్న గురువులకు వందనం. 

[ ఈ వ్యాసాన్ని ముందు తెలుగులో వ్రాసిన తరువాత నాకు ప్రస్తుతం వచ్చిన స్వల్ప మాత్రపు సంస్కృతంలోకి తర్జుమా చేసాను. ఇంకొన్నాళ్ళు సంస్కృతం నేర్చుకున్నతరువాత ఇంకా బాగా రాయగలనని అనుకుంటున్నాను. ]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top